లక్కున్నోడు మొదలుపెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, హన్సిక జంటగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న లక్కున్నోడు చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు మోహన్‌బాబు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ,‘లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా ఇది. గీతాంజలి, త్రిపుర వంటి సినిమాల దర్శకుడు రాజ్‌కిరణ్ ఈసారి భిన్నంగా లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలు చేసిన విష్ణు, హన్సిక కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ హిట్ ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: పి.జి.విందా, ఆర్ట్: చిన్న, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, దర్శకత్వం: రాజ్‌కిరణ్.