అరకులో అలరించే గడ్డం పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికీషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేక బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్క సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి రాహుల్‌రాజ్, వాసుదేవ్ అందించిన సంగీతం హైదరాబాద్‌లో విడుదల చేశారు. థియేటర్ ట్రైలర్‌లను హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేయగా, ఆడియో సీడీని పూరీ జగన్నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ, గడ్డం పాట సినిమాలో అందర్నీ అలరిస్తుందని అన్నారు.
థియేటర్ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని, రామ్‌శంకర్‌కు ఈ చిత్రం బ్రేక్ తెస్తుందని కళ్యాణ్‌రామ్ అన్నారు. అరకురోడ్డు చిత్రం తన హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమని, అందరూ హార్డ్‌వర్క్‌తో ఈ సినిమాకోసం పనిచేశారని కథానాయిక నికీషాపటేల్ అన్నారు. ఈ సినిమాలో కథానాయకుడు భయస్తుడని, అమ్మాయిలను చూస్తే నత్తివస్తుందని, అలాంటి హీరో జీవితంలో జరిగే ఓ సంఘటనతో జీవితం ఎలా మలుపు తిరిగింది అనే కథనంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చక్కగా చిత్రీకరించారని హీరో రామ్‌శంకర్ అన్నారు. ఈ చిత్రంతో తాను మరోసారి దండయాత్రకు వస్తున్నానని, తప్పక విజయవంతవౌతుందని ఆయన అన్నారు. ఈ సినిమా బాగా వచ్చిందని, సహకరించిన ప్రతీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని నిర్మాతలు అన్నారు.