ఎన్టీఆర్‌తో చాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ హిట్‌తో మంచి జోరుమీదున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఆయనతో సినిమా చేయాలని పలువురు దర్శకులు కథలను సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించే పనిలో ఉన్నారు. మొదట దర్శకుడు పూరీ జగన్నాథ్ తారక్‌కు ఓ కథ చెప్పాడని, కానీ అది పూర్తి స్థాయిలో చెప్పలేదని, ‘ఇజం’ పనులు పూర్తయ్యాక మిగతా సగం చెబుతాడని, అప్పుడు తారక్‌కు నచ్చితే ఆ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని తెలుస్తోంది. అలాగే ‘పటాస్’తో హిట్ అందుకుని ‘సుప్రీం’తో దర్శకుడిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి కూడా తారక్‌కు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ కథను చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కాక తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కూడా తారక్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ఓ మంచి యాక్షన్ కథను కూడా వినిపించి జూనియర్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడట. ఇక వీరందరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది తారక్ చేతిలోనే ఉంది మరి.

చిత్రం.. దర్శకుడు లింగుసామి