ఇమేజ్ చట్రంలో ఇరుక్కోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘సిద్ధార్థ’ సెప్టెంబర్ 16న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరో సాగర్ చెప్పిన విశేషాలు..

ఫ్యాక్షన్...లవ్‌స్టోరీ
‘సిద్ధార్థ’ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో ఓ ఎన్నారై యువకుడిగా కన్పిస్తాను. తన పని తను చేసుకునే యువకుడు అనంతపూర్‌కు ఎందుకు వెళతాడు? ఏం చేస్తాడనేదే సినిమా. సినిమా చూసుకున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, దయానందరెడ్డి, దాసరి కిరణ్‌కుమార్ వంటి ఓ మంచి టీం సాగర్‌కు ఇండస్ట్రీలో ప్లేస్ క్రియేట్ చేయాలని ఆలోచనతో చేసిన సినిమా ఇది.

ఏడాదిగా కష్టపడ్డా..
నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ఓ సినిమాకు ఆడియెన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ ఎలిమెంట్స్ సినిమాలో వుండాలి.. ఇలా అన్ని శాఖలపై మంచి పట్టు వుంది. మూడేళ్లుగా సీరియల్స్ చేయడం లేదు. సీరియల్స్‌కు, సినిమాకు యాక్టింగ్ పరంగా పెద్ద తేడా లేదు. అయితే టెక్నికల్‌గా మాత్రం తేడా వుంటుంది. నేను సినిమాల్లోకి పూర్తిగా ఎంటర్ కావాలనుకోలేదు. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. అయితే నన్ను ఇష్టపడే ప్రేక్షకులు నా నుండి చిన్న పాత్రలను ఎక్స్‌పెక్ట్ చేయడంలేదని, నేను తప్పు చేశాననిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘సిద్ధార్థ’ సినిమావైపు నడిపించింది. ఈ సినిమా కోసం ఒక సంవత్సరంపాటు బాడీ లాంగ్వేజ్ పరంగా కష్టపడ్డాను.

ఇమేజ్ చట్రంలో..
నాకు ఇమేజ్ చట్రంలో ఇరుక్కోవాలని లేదు. మంచి నటుడుగా, దర్శక నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకని డిఫరెంట్ సినిమాలను చేయాలనుకుంటున్నాను. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్‌కు అంతగా ప్రాముఖ్యత ఉండదు. కానీ ఈ సినిమాలో రాగిణి, సాక్షి చౌదరిలకు వారి వారి పాత్రల పరంగా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఇక నా నెక్ట్స్ మూవీ టైటిల్ ‘హరి’. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడతాను.

-యు