ఇదో ప్రేమలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశీ ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ఇదో అందమైన ప్రేమకథ అని, ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తనవాళ్ళని వదులుకుని ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే మేఘమాల అనే అమ్మాయి కథగా చిత్రీకరించామని తెలిపారు. తాను రాసుకున్న కథను నమ్మి ముందుకు వచ్చిన నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా అందమైన లొకేషన్లలో తీర్చిదిద్దారని, ఓ మంచి ప్రేమకథా చిత్రంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు. ప్రత్యేక పాత్రలో సుమన్, నరేష్ నటించారని, కోదాడ, మట్టపల్లి, వేదాద్రిలాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని నిర్మాత ఎస్.పి.నాయుడు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు.