కొత్త కొత్తగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల విడుదలైన మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే ఆ ప్రభావం మహేష్‌పై ఏ మాత్రం పనిచేయలేదు. ఎప్పటికప్పుడు కథలు కొత్త కోణాల్లో ఎంచుకునే మహేష్‌బాబు కోసం దర్శకులు కథలను సిద్ధం చేయడంలో తలమునకలవుతున్నారు. కొత్తదనం ఎక్కడ కనిపించినా తన హీరోయిజానికి ప్లస్‌గా మారుతుందనుకుంటే ఆ కథలలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా, స్టైలిష్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దర్శకులు కూడా మహేష్‌బాబు ఏ కోణంలో కనిపించినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో కథలను సిద్ధం చేస్తున్నారు. మురగదాస్‌లాంటి దర్శకుడుకూడా మహేష్‌బాబుతో సినిమా తీయాలనుకోవడానికి ఇదే కారణం. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌కు మరింత సహాయపడింది. ఆ చిత్రంలో మహేష్‌బాబు నటన, గ్లామర్ ప్రేక్షకులను సమ్మోహితులను చేశాయి. అదేవిధంగా మురగదాస్ రూపొందిస్తున్న చిత్రంలో కూడా మహేష్‌బాబు సరికొత్తగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని తెలిసింది. మురగదాస్ చిత్రం అంటేనే హీరోలు వైవిధంగా కన్పిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేష్‌బాబు ఎలా కన్పించబోతున్నారు అని అంటే, ఇదే విషయాన్ని మురగదాస్ వివరణలో వినాల్సిందే. పోలీస్ కాప్‌గా మహేష్‌బాబు నటన తనకెంతో ఇష్టమైనదని, పోలీస్ అంటూ మహేష్‌బాబు చేసే యాక్షన్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, అందుకే తన చిత్రంలో కూడా మహేష్‌బాబును పోలీస్‌గానే చూపిస్తున్నానని తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో ఆయన ఈ చిత్రంలో నటిస్తున్నాడని సమాచారం. అయితే పోలీస్ డ్రెస్‌లో కాకుండా ఈ పాత్రను స్టైలిష్‌గా కన్పించేలా డిజైన్ చేశామని అంటున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న ఆ చిత్రం పూర్తవ్వగానే, దర్శకుడు కొరటాల శివ చిత్రం ప్రారంభం కానుంది. ఆ తరువాత కూడా మహేష్‌బాబుతో సినిమాలు చేయడానికి త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లి, విక్రం కె.కుమార్ లాంటి అద్భుతమైన దర్శకులు వరుసలో వున్నారు. అయితే వీరందరు మహేష్‌బాబును స్టైలిష్‌గా, కొత్తకొత్తగా చూపే ప్రయత్నమే చేస్తున్నారు కథ సంగతి తర్వాత, ముందు అప్పీయరెన్స్ బాగుంటే కథ కథనాలను ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా రూపొందిస్తే సినిమా విజయం నల్లేరుపై నడకలా ఉంటుందని దర్శకులు భావిస్తున్నారు. కొరటాల శివ, వంశీ పైడిపల్లి రూపొందించిన కథల గూర్చి ఇప్పటికే కొద్దో గొప్పొ పరిశ్రమలో తెలిసిందట. ఈ కథలు కొత్తగా వున్నాయని ఇప్పటినుంచే వినిపిస్తున్న సమాచారం. ‘ఊరు నీకెంతో ఇచ్చింది- తిరిగి ఇచ్చెయ్, లేకుంటే లావైపోతావు’ అన్న స్లోగన్‌తో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఇప్పుడు ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’ అని చెప్పే కథాంశంతో కొరటాల శివ తాజా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడని వినికిడి. అలాగే, వంశీ పైడిపల్లి తన మాతృదేశంపై అభిమానంతో విదేశాలనుండి వచ్చిన ఓ యువకుడి కథ, కథనంతో సినిమా చేస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. మొత్తానికి టాలీవుడ్ హీరోల పోటీలో మహేష్‌బాబు స్టైలిష్ పరుగు ఓ వెరైటీ. ఆ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ తనను తాను ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దికుంటున్నాడు మహేష్‌బాబు.

-తిలక్