సైతాన్ రణతంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన ‘రణతంత్ర’ చిత్రాన్ని తెలుగులో ‘ఇది పెద్ద సైతాన్’ అనే పేరుతో అనువదించారు. విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రావు మార్టోరి అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- హరిప్రియ నటన హైలెట్‌గా సాగే ఈ చిత్రం తెలుగులో వచ్చిన హారర్ చిత్రాలకు ధీటుగా వుంటుందని, మంచి కంటెంట్‌తో సాగే ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ఎం.కార్తీక్, నిర్మాత:వెంకట్రావు మార్టోరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆదీరామ్.