రానా, ఆర్యల మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ చిత్రసీమలో మల్టిస్టారర్ సినిమాలకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. ఒకే భాషకు చెందిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడమే కాకుండా ఇరు ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నాగార్జున-కార్తీ కలిసి ‘ఊపిరి’ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఇద్దరు యంగ్ హీరోస్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఓ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ యువ హీరోలే రానా దగ్గుబాటి, ఆర్య. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయనున్నారు. తమిళంలో ‘వౌనం పెసియాదే’, ‘పరుత్తివీరన్’ లాంటి సినిమాలతో మెప్పించి అవార్డులు కూడా అందుకున్న అమీర్ రీసెంట్‌గా వీరిద్దరిని కలిసి ఓ కథ చెప్పాడు. రానా, ఆర్యకి కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు. దాంతో ఈ ఇద్దరు హీరోలు సినిమాకోసం తమ కాల్షీట్స్‌ను అడ్జస్ట్‌చేసే పనిలోపడ్డారు. చెప్పాలంటే రానా వచ్చే ఏడాది బాహుబలి 2తో చాలా బాజీ.. కానీ ఈ సినిమాకి కూడా మధ్యలో డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు.