నందిని నర్సింగ్ హోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్, నిత్య, శ్రావ్య ముఖ్యపాత్రల్లో పి.వి.గిరి దర్శకత్వంలో ఎస్.వి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాధాకిషోర్.జి, భిక్షమయ్య సంగం నిర్మిస్తున్న ‘నందిని నర్సింగ్ హోం’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ శనివారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు కృష్ణ, విజయనిర్మల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ, ‘నవీన్ నాలుగేళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మూడో జనరేషన్ హీరో. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి హెల్ప్ అవుతుందని నమ్మకముంది. ఈనెల 27న పాటలను విడుదల చేస్తాం. ఆ కార్యక్రమంలో మహేష్ పాల్గొంటాడు’ అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ‘ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రమిది. నవీన్‌కు మంచి విజయాన్ని అందించాలి’ అన్నారు. హీరో నవీన్ మాట్లాడుతూ, దర్శకుడు గిరి మంచి కథను అందించారని, సినిమా చిత్రీకరణ పూర్తయి, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, మంచి ఎంటర్‌టైనర్‌గా సాగే కథ ఇదని అన్నారు. ఈ సినిమా హీరోగా ఇమేజ్ తెస్తుందని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- మంచి కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా సాగుతుందని, హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారని, ఇటీవల దిల్‌రాజు సినిమా చూసి బాగుందని అన్నారని, తప్పకుండా నవీన్ కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అచ్చు, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, కెమెరా:దాశరధి శివేంద్ర, నిర్మాతలు:రాధాకిషోర్.జి, భిక్షమయ్య సంగం, దర్శకత్వం:పి.వి.గిరి.