సిద్ధార్థకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్, సాక్షీచౌదరి, రాగిణి నంద్వాని ముఖ్యపాత్రల్లో దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి వేంకటేశ్వరరావుమాట్లాడుతూ, సిద్ధార్థ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని, బుల్లితెరపై హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సాగర్, వెండితెరపై తొలి చిత్రంతో రాణించాడని, ఇప్పటివరకూ ఎంతోమంది హీరోలను పరిచయం చేశామని, తాజాగా సాగర్ కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా వుందని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, ఈ విజయం నా జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. హీరోయిన్ రాగిణి నంద్వాణి మాట్లాడుతూ, ఇంత మంచి విజయంలో భాగస్వామిని అవడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ- ఏడేళ్లుగా బుల్లితెరపై స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకోవడం మామూలు విషయం కాదని, సాగర్ తన పేరుకంటే కూడా ఆర్.కె.నాయుడుగానే గుర్తింపు తెచ్చుకున్నాడనిఅన్నారు. హీరో సాగర్ మాట్లాడుతూ- టీవీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేను సినిమాల్లోకి వెళ్లడం అవసరమా అనుకున్నానని, ఒక్కో సమయంలో ఎక్కువ ఆశపడుతున్నానేమోననే అనుమానం కలిగిందని, కానీ ఈ విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని రేపిందని అన్నారు.