దమ్ముచూపే కాంబినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ హిట్‌తో మాంచి జోష్‌మీదున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా టాలీవుడ్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద డెబ్భై కోట్ల మార్కెట్‌ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా తరువాత నెక్స్ట్ ఏమిటనే ఆలోచనలో పడ్డాడు ఎన్టీఆర్. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీతో సినిమా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో పూరితో చేయాలనీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోగా ‘పటాస్’తో ఫామ్‌లోకి వచ్చిన అనిల్ రావుపూడి కూడా ఓ కథ సిద్ధం చేసి ఎన్టీఆర్‌కు వినిపించాడు. అలాగే తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూడింటిలో ఏది చేద్దామనే ఆలోచనలో ఉండగానే... ఇప్పుడు మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. అతనే బోయపాటి శ్రీను. లెటెస్ట్‌గా ‘సరైనోడు’ సినిమాతో హిట్ అందుకున్న బోయపాటి, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇదివరకే ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా బోయపాటికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో బోయపాటితో సినిమా చేస్తే మళ్ళీ మాస్ ఇమేజ్ తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. త్వరలోనే కథ కూడా వినిపించాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు బోయపాటి... మరి ఈ సినిమాల్లో ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడో అన్నది ఆయన ఫాన్స్‌కు ఆసక్తిగా మారింది.