కాటమరాయుడి కసరత్తు 20నుంచి రెండో షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇదివరకే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేయాలనీ భావించాడు కానీ ఈలోగా కేంద్రం ప్రత్యేక రాయితీని ప్రకటించడంతో.. పవన్ మళ్ళీ సినిమా షూటింగ్‌లో బిజీ అవ్వాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి. ‘కాటమరాయుడు’ నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 20నుండి మొదలుకానుంది. ఇప్పటికే అన్నిరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో పవన్ నాలుగురోజులు ఆలస్యంగా పాల్గొంటాడని తెలిసింది. దానికి కారణం ఆయన ఫిట్నెస్‌కోసం ఈరోజు బెంగుళూరు వెళుతున్నాడట. అక్కడ వారం వుండి.. ఆ తరువాత 24నుండి షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు పవన్ వర్గాల ద్వారా తెలిసింది! కంటిన్యూగా షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్!! ఈ చిత్రంలో గ్లామర్ భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ త్వరలోనే ఫినిష్ చేసి... జనవరిలో చిత్రాన్ని విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.