మంచి పాత్రలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ, వరుస విజయాలతో దూసుకుపోతోంది సమంత. గత ఏడాది పోలీసోడు, 24, బ్రహ్మోత్సవం, జనతాగ్యారేజ్, అ ఆ చిత్రాలతో టాప్‌లో నిలిచింది. పరాజయాలు పక్కనపెడితే, సంచలన విజయాలు అందుకుంటున్న సమంత ఈమధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణం పెళ్లిచేసుకుంటుందంటూ వస్తున్న వార్తలేమోనని అనుకుంటున్నారు జనాలు. కానీ, దానికి వేరే కారణం ఉందని, ఆ కారణమేంటో చెప్పేసింది సమంత. నిజంగా సమంత చెప్పిన కారణం విని ముఖ్యంగా దర్శకులు షాక్ అవ్వాల్సిందే. అసలు ఆమె చెప్పిన కారణం ఏమిటో తెల్సా? సౌత్‌లో అర్థవంతమైన పాత్రలు దక్కించుకోవడం ఒక హీరోయిన్‌కు చాలా కష్టమని, అలాంటి పాత్రలు దొరకడం లేదు కాబట్టి ఎక్కువ సినిమాలను ఒప్పుకోవడం లేదని చెబుతోంది. అంటే, సమంత చెప్పినదాంట్లో నటనకు ఆస్కారమున్న పాత్రలు రావడంలేదనే అర్థం కనిపిస్తోంది. ఈరోజుల్లో సినిమాల్లో హీరోయిన్ అంటే, లిప్‌పాక్‌లు, బికినీలంటూ అదరగొడుతున్నారే తప్ప నటనకు ప్రాధాన్యతను ఇవ్వడంలేదు. ఈ విషయంలో సమంత బాధపడడం తప్పేమీ లేదనిపిస్తోంది. మరి సమంత కామెంట్‌తో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.