దెయ్యాలబండి వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో 5 కలర్స్ మల్టీమీడియా మూవీ పతాకంపై ‘ఏకవీర’, ‘వెంటాడు వేటాడు’ చిత్రాలను నిర్మించారు శ్రీనివాస్ దామెర. తాజాగా 5 కలర్స్ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘హౌల్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాలబండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న ఇండియా వైడ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ దామెర మాట్లాడుతూ... హాలీవుడ్ చిత్రాల తరహాలో వస్తోన్న హారర్ చిత్రం ‘దెయ్యాలబండి’. ఈ చిత్ర కథ విషయానికొస్తే... ఒక సిటీనుంచి బయలుదేరిన ప్యాసింజర్స్ ట్రైన్ హెవీ రైన్ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌లోకి వింత వింత ఆకారాలతో, హాహాకారాలు చేస్తూ కొన్ని దెయ్యాలు ఎంటరై అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి? ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈనెల 23న ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నాం’ అన్నారు.