హైపర్ పాటలకు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న ‘హైపర్’ (ప్రతీ ఇంట్లో ఒకడుంటాడు) చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, మొదటి పాటకు కూడా అన్ని కేంద్రాలనుండి మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు. మ్యూజికల్ మంచి హిట్ అయ్యే ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావురమేష్, మురళీశర్మ, పోసానికృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కెమెరా: సమీర్‌రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.