బ్రాహ్మణులను కించపరచలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అత్తారిల్లు’ సినిమా విడుదలైనప్పటినుండీ తమ యూనిట్ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఒక పాత్రను పెట్టారని, దానిని తొలగించాలంటూ బెదిరిస్తున్నారని చిత్ర దర్శకుడు అంజన్ కె. కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఎక్కడా బ్రాహ్మణులను కించపరిచే సంభాషణలు, సన్నివేశాలు లేవని, సినిమాను నెగెటివ్ దృష్టితోకాకుండా చూడకుండా పాజిటివ్ దృక్పథంతో చూస్తే అర్థమవుతుందని ఆయన కోరారు. అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నూతన తారలతో రూపొందించిన ‘అత్తారిల్లు’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పలు విశేషాలు తెలుపుతూ విడుదలైన అన్ని కేంద్రాలలో మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కించపరిచే సంభాషణలు వుంటే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పేదని, తమ సినిమాపై ఎవరో లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తున్నారని, కానీ సినిమాపై వస్తున్న రెస్పాన్స్‌తో ఆనందంగా వున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో తమకు అవకాశం లభించడం, తమ పాత్రకు మంచి గుర్తింపు రావడం ఆనందంగా వుందని రాజేందర్, వినోద్‌కుమార్, నండూరి రాము, రాకేష్, సాయి రవికుమార్, అతిథి దాస్ తెలిపారు. కార్యక్రమంలో జోజో, తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు.