నూతన హీరోలతో ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు జయంత్ సి.పరాంజి గతంలో అగ్రహీరోలతో చిత్రాలను రూపొందించేవాడు. ఇప్పుడు నూతన నటీనటులను పరిచయంచేస్తూ కొత్త టాలెంట్‌ను వెండితెరకు చవిచూపుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన రవి గంటా హీరోగా కాళహస్తి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో హీరో నీలేష్ ఈటి, ఇజబెల్ కథానాయికగా ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘ఉగ్రం’ అనే మరో చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంబాయి అండర్ వరల్డ్ డాన్, ఓ తెలుగు పోలీసు అధికారి మధ్య జరిగే హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ముంబై, హైదరాబాద్‌లలో చిత్రీకరిస్తామని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా:రాజ్‌కుమార్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, రచన, దర్శకత్వం:జయంత్ సి.పరాన్జీ.