కొత్త కథలకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ప్రస్తుతం ‘లక్కున్నోడు’ చిత్రానికి పనిచేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ నేటినుండి జరుపుకోనున్న ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తుందని డైమండ్ రత్నబాబు తెలిపారు. బందర్‌కు చెందిన తాను, సినిమాల మీద వున్న ఆసక్తితో పరిశ్రమకు వచ్చానని, దేవదాస్, సీమశాస్ర్తీ చిత్రాలకు పనిచేశానని, ఇప్పటివరకు ఓ 15 సినిమాల దాకా చేశానని ఆయన అన్నారు. ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాకు మంచి ఇమేజ్ వచ్చిందని, ప్రస్తుతం లక్కున్నోడు చిత్రం మంచి గుర్తింపునిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
కథలు మారుతున్నాయి
కొరటాల శివ రచయితగా తనకెంతో నచ్చారని, ఎన్టీఆర్, మహేష్‌లాంటి హీరోలను పెట్టుకుని ఆరుపాటలు, నాలుగు ఫైట్స్ లాంటి కమర్షియల్ హిట్స్ చేయగలిగినా, కథను నమ్ముకుని ఆయన సినిమాలు చేస్తున్నాడని అన్నారు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో ఇక తాను కూడా దర్శకుడిగా మారాలని ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఈమధ్య రచయితలందరూ దర్శకులవుతున్నారని టాక్ వినిపిస్తోందని, దానికి కారణం కథలు రాసుకునే సత్తా వున్నవాళ్ళే దర్శకులయ్యే అవకాశం వుంది కనుక, అలా జరుగుతోందన్నారు. లఘు చిత్రాలతో కొత్తవాళ్ళు అనేకమంది కొత్త కొత్త అయిడియాతో వస్తున్నారని, చాలామంది రచయితలు పరిస్థితి బాగులేక ఘోస్ట్ రచయితలుగా కష్టపడుతున్నారని, చాలామంది రచయితల పేర్లు సినిమాలో వేయడంలేదని, రచయితకు సరైన గౌరవం దక్కితే మంచి సినిమాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.