ఒకసారి ఇటు చూడవే అంటున్న చైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానిని ‘అష్టాచమ్మ’తో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసి, అతని కెరీర్‌లో ‘జెంటిల్‌మన్’ వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి త్వరలో యంగ్ హీరో నాగచైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రము ఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలవుతుందని తెలుస్తోంది.
ఇకపోతే చైతన్య కూడా ఈ ప్రాజెక్టు కాక తన రెండు సినిమాలు ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’లు రిలీజ్‌కు రెడీగా ఉండగానే మరో రెండు చిత్రాలను ప్రారంభించనున్నాడు. వాటిలో ఒకటి ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణతో చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి ‘ఒకసారి ఇటు చూడవే’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతతో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమంత కూడా అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్‌లకు హాజరవుతూ వస్తున్నారు. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడంతో వీరిద్దరి పెళ్ళెప్పుడు జరుగుతుందని కొద్ది రోజులుగా బాగా చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే విషయమై చైతన్య ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెన్నైలో నిన్న సాయంత్రం జరిగిన సెలెబ్రిటీ బాడ్మింటన్ లీగ్ లాంచ్‌లో పాల్గొన్న చైతన్యకు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ ‘పెళ్ళి వచ్చే ఏడాది చేసుకుంటా, అయితే తేదీ ఎప్పుడన్నది మాత్రం ఇంకా ఆలోచించలేదు’ అని స్పష్టం చేశారు.