గడుసుపిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్లకి తరచుగా ఎదురయ్యే అతిక్లిష్టమైన ప్రశ్నలేంటో తెలుసా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో కలిసి సినిమా చేయాలనుంది? అనేవి. ఆ ప్రశ్నలు అడగ్గానే హీరోయిన్లు తలకొట్టుకొంటుంటారు. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదే వీలైనంతమంది కథానాయకులతో కలిసి నటించాలని. మరి ప్రత్యేకంగా ఏ హీరో ఇష్టం? ఎవరితో కలిసి నటించాలనుందని అడిగితే వాళ్లుమాత్రం ఏమని ఆన్సర్ ఇస్తారు? నిజంగా ఎవరిపైనైనా ప్రత్యేకమైన ఇష్టమున్నప్పటికీ వాళ్ల ఒకరి పేరు చెబితే ఇంకొకరు ఏమనుకొంటారో అనే భయం వెంటాడుతుంటుంది. అందుకే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దాటేస్తూ సింపుల్‌గా తప్పించుకొంటుంటారు హీరోయిన్లు. ఇటీవల రెజీనాకి ఓ టీవీ షోలో ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె సాయిధరమ్ తేజ్ పేరో, సందీప్‌కిషన్ పేరో చెబుతుందని ఊహించారంతా. కానీ రెజీనా మాత్రం యంగ్ హీరోల జోలికి వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి, సీనియర్ హీరోల జాబితా విప్పింది. ఆ జాబితా మామూలుది కాదు. చాలాపెద్దది. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, సూర్య, విక్రమ్... ఇలా అన్నమాట.

చిత్రం..రెజీనా