గౌతమ్ దర్శకత్వంలో కార్తీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టిప్పు’, ‘పడేసావే’ చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన కార్తీక్‌రాజు తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ దర్శకుడిగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల 11న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కార్తీక్‌రాజు మాట్లాడుతూ- తొలి చిత్రాలలో కనిపించినట్లు కాకుండా బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా వుండడానికి ఫిజిక్‌పరంగా, లుక్ పరంగా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చానని, ఓ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు. గౌతమ్ కథలో కొత్తదనం వుండడంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నామని, కథాపరంగా తనకు చక్కగా సూటయ్యే పాత్ర కనుక ఈ చిత్రంలో నటిస్తున్నానని, పెద్ద హిట్టై తనకు మంచి బ్రేక్‌నిస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. అక్టోబర్ 11న ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గౌతమ్.