అందరికీ నచ్చేలా తను వచ్చెనంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజ కాకుమాను, రేష్మిగౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను వచ్చెనంట’. అచ్యుత్ ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు విడుదల చేశారు. పాటలను బి.ఎ.రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, జర్నలిస్టు శీను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట్ కాచర్ల మాట్లాడుతూ, లవ్‌స్టోరీతో పాటు హారర్, కామెడీ చిత్రాల హవా నడుస్తున్న ఈ తురణంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వినూత్న ప్రయత్నంగా కామెడీ జోనర్‌లో రూపొందించిన చిత్రమిదని. తేజ, రేష్మి పాత్రలు సినిమా హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు. చిత్ర నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, చిన్న సినిమాకి మార్కెట్ వుండదని చాలామంది అంటుంటారని, కానీ మా సినిమాకు మంచి బిజినెస్ అవుతుందని అన్నారు. రేష్మి, తేజ, ధన్యబాలకృష్ణన్, చంటి సహా అందరూ బాగా నటించారని, వెంకట్ కాచర్ల కొత్త జోనర్‌లో సినిమాను అద్భుతంగా తీశారని అన్నారు.ఈనెలాఖరున సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. రేష్మి గౌతమ్ మాట్లాడుతూ, టాలీవుడ్‌లో ఇప్పటివరకూ రాని కామెడీ జోనర్ సినిమా ఇదని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులందరూ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.