తుటక్...తుటక్ తుటియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె లేకపోతే ఏం? ప్రభుదేవ, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా వైవిధ్యమైన కథనం ఎంచుకుని దర్శకత్వం వహించే ఎ.ఎల్.విజయ్ నేతృత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఇదే చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో అదే తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో జరిగింది.
తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని హిందీలో ‘తుటక్ తుటక్ తుటియా’గా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమానికి అభినేత్రి తమన్నా గైర్‌హాజరైంది. ఆమె తప్పకుండా వస్తుందనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితేనేం ఆ నిరాశను పటాపంచలు చేసి అందరి మెప్పును పొందింది కంగనా రౌనత్. ఆమె రాకతో ఆ కార్యక్రమ వాతావరణమే మారిపోయింది. అభిమానులు కంగనాను చూసి చిందులు వేశారు. తమన్నాకన్నా కంగనా రౌనత్ రావడమే కార్యక్రమానికి నిండుదనం వచ్చిందని వ్యాఖ్యానించడం విశేషం. తన చిత్రాలే కాకుండా మంచి చిత్రం ఏదైనా సరే వచ్చి ప్రమోషన్‌లో పాలుపంచుకోవడంతో కంగన గొప్పతనం అర్థమైంది అందరికీ. ఉత్తమ నటే కాదు, ఉత్తమ విలువలున్న మానతావాది అని కార్యక్రమంలో పలువురు పొగడడంతో ఉబ్బి తబ్బిబ్బు అయింది కంగనా!

చిత్రం..ముంబైలో జరిగొన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ప్రభుదేవా, కంగనా రౌనత్