రోబో-2 షూటింగ్‌లో అక్షయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్‌ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. భారతీయ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్‌లో ఎక్కువ భాగం రజనీ మీదే షూట్ చేయాల్సి ఉంది. ‘కబాలి’ తరువాత పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్న రజనీ సెప్టెంబర్ 23నుండి చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో రజనీ, అక్షయ్‌కుమార్, యామీజాక్సన్‌ల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. అలాగే ఈ చివరి దశ షూటింగ్‌ను ఈ షెడ్యూల్లోనే ముగించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇకపోతే ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంయొక్క ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌లో విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.