జనవరిలో కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా మారిపోయిన కొరటాల శివ, తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమాతో వరుసగా మూడో బ్లాక్‌బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 5లో రెండు కొరటాల శివ సినిమాలే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ తదుపరి సినిమా సూపర్‌స్టార్ మహేష్‌తో ఉండనున్నట్లు కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాకావడంతో ఇప్పట్నుంచే మహేష్ ‘కొరటాల’ రెండో సినిమా గురించి అభిమానులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. ‘మహేష్‌తో చేయబోయే రెండో సినిమా కూడా శ్రీమంతుడులానే మంచి కథతో ఉంటుంది.’ అని అన్నారు. అదే విధంగా జనవరి నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని, ప్రస్తుతం మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా పూర్తి స్క్రిప్ట్‌సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు.