చెదిరిన బంధం ఏంజిలినా జూలీ, బ్రాడ్‌పిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన, అపురూపమైన జంటగా పేరుపొంది.. ‘బ్రాంజిలోనా’ అన్న ప్రత్యేక పదాన్ని తమ పేరుగా మార్చుకున్న ఏంజిలినా జూలీ, బ్రాడ్‌పిట్‌ల వివాహబంధం చెదిరిపోయింది. హాలీవుడ్ నటుడు, భర్త బ్రాడ్‌పిట్ నుంచి విడాకులు కోరుతూ ఆమె లాస్‌ఏంజిలిస్‌లోని ఉన్నత న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. ఈ విషయాన్ని ఏంజిలినా ప్రతినిధి వెల్లడించగా, తాజా పరిణామం తనకు విచారం కలిగించిందని పిట్ పేర్కొనడం గమనార్హం. అతడు నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్ మేరియాన్ కొటిల్లార్డ్‌తో సన్నిహిత సంబంధాలు నెరపడమే వీరి మధ్య వివాదానికి కారణమని భావిస్తున్నారు. సంపన్న జంటగా వినుతికెక్కిన వీరికి దాదాపు 308 మిలియన్ డాలర్ల ఆస్తి ఉందని అంచనా. వియత్నాం, కంబోడియా, ఇథియోపియాలకు చెందిన ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సొంత బిడ్డలను సాకుతున్న ఈ జంట ఇప్పుడు విడిపోతోంది. పిల్లల బాధ్యత తనకు అప్పగించాలని, బ్రాడ్‌పిట్‌కు వారిని అప్పుడప్పుడు చూసే అవకాశం కల్పించాలని కోర్టును జూలీ కోరింది. అమెరికా, కంబోడియా దేశాల పౌరసత్వం ఉన్న ఏంజిలినా జంటకు ఫ్రాన్స్, అమెరికా సహా వివిధ దేశాల్లో లెక్కకుమించి ఆస్తులున్నాయి.
మానవతావాదిగా, మహిళల హక్కుల మద్దతుదారుగా, వలసవాదుల తరపున ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూతగా, సినీ నటి, దర్శకురాలు, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఏంజిలినా తండ్రి జాన్ వొయిట్‌తో బాలనటిగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అందచందాలు, నటనావైదుష్యంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. పధ్నాలుగేళ్లకే డేటింగ్ మొదలుపెట్టిన ఆమె గతంలో జానీ లీమిల్లర్, బిల్లి బాంబ్ థోర్టన్‌లను వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. మరికొందరితో సహజీవనం చేసింది. చివరకు హాలీవుడ్‌లో పేరుపొందిన నటుడు బ్రాడ్‌పిట్‌తో ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ సినిమాలో కలసి నటిస్తూ ప్రేమలో పడింది. అప్పటికే మరోనటి జెన్నిఫర్ అనిస్టన్‌ను వివాహం చేసుకున్న ప్రిట్ జూలీతో ప్రేమాయణం కొనసాగించాడు. జెన్నిఫర్‌కు విడాకులు ఇచ్చి ఏంజిలినాతో సహజీవనం మొదలుపెట్టాడు. 2005 నుంచి కలిసి ఉంటున్నప్పటికీ ఈ జంట 2014లో వివాహం చేసుకుంది. సహజీవనం చేస్తున్నప్పుడే ఇథియోపియా, వియత్నాం, కంబోడియాలకు చెందిన నెలల వయస్సున్న ముగ్గురు చిన్నారులను ఈ జంట దత్తత తీసుకుంది. మరో ముగ్గురు సొంత బిడ్డలతో కలిపి ఆరుగురు పిల్లలను ఈ జంట సాకుతోంది. ఐక్యరాజ్య సమితి హై కమిషన్ ఆఫ్ రిఫ్యూజీ ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న ఏంజిలినా మానవతావాదిగా పేరుపొందారు. మహిళల హక్కుల కోసం, పేదల కోసం, విద్యాభివృద్ధి కోసం ఆమె పోరాడుతోంది. దాదాపు 40 దేశాల్లో పర్యటిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడి ధైర్యంగా నిలిచి, ఆపరేషన్‌తో ప్రమాదాన్ని తప్పించుకుని ఎందరికో స్ఫూర్తినిచ్చింది. 1999లో ఆమె నటించిన ‘గర్ల్, ఇంటరప్టడ్’ సినిమాలో ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ఏంజిలినా జూలీ, బ్రాడ్‌పిట్‌ల జంట ఇంతకాలం హాలీవుడ్‌లో ఓ అపురూపమైన స్థానాన్ని పొందారు. వీరి వివాహబంధం చెదిరిపోవడం ఇప్పుడు పెను సంచలనమైంది. నిజానికి గత ఐదేళ్లుగా వీరి మధ్య విబేధాలు పొడసూపినట్లు వార్తలు వచ్చినా ఎప్పటికప్పుడు అది తప్పంటూ వీరిద్దరూ కలసిమెలసి మీడియాకు కనిపిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ చివరకు అదే నిజమైంది.