కళ్లెం లేని కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది. అయినాకనీ కాజల్ గ్లామర్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. పెద్ద హీరోలతోపాటుగా చిన్న హీరోల చిత్రాల్లో నటిస్తూ తన హవా చాటుతోంది. తాజాగా ఎన్టీఆర్‌తో ఐటెం పాటలో కూడా నర్తించి శభాష్ అనిపించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాల్షీట్లు దొరకని తారగా రికార్డు సృష్టించింది. పెద్ద హీరోలతో పాటుగా చిన్న హీరో జీవా (రంగం ఫేం)తో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. తమిళంలో ‘కవలై వేండామ్’ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రాన్ని డి.వి. సినీ క్రియేషన్స్ పతకంపై డి.వెంకటేష్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్ భారీ పోటీ ఏర్పడిన నేపథ్యంలో నిర్మాత ఫ్యాన్సీ ఆఫర్‌తో ఈ సినిమా హక్కులను దక్కించుకోవడం విశేషం. కాజల్ అగర్వాల్‌తో జీవా కాంబినేషన్ అనగానే అటు తమిళ, ఇటు తెలుగులో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికితోడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లకు మంచి స్పందన లభిస్తుండడంతో ఈ చిత్రంపై కాజల్ పూర్తి భరోసాతో వుంది. ఈ సినిమా హిట్ అవడం గ్యారంటీ అని, తన కెరీర్‌లో మరో భారీ హిట్‌తో ఈ చిత్రం మరిన్ని ఆఫర్లను తీసుకొస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే, ఇప్పటివరకూ ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా వున్న కాజల్, ఈ చిత్రంలో బికినీలో కనిపిస్తోందట. కెరీర్ చివరి దశకు చేరుతుందన్న భావనో, లేకపోతే ఇపుడు కాకపోతే ఇంకెప్పుడు గ్లామర్ పండిస్తాం అన్న తెగువో కానీ ఈ చిత్రంలో బికినీలో రెచ్చిపోనుందట. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కనుక కాజల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు పేరు ఖరారు కాని ఈ చిత్రంలో కాజల్ గ్లామర్ హైలెట్‌గా నిలవనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సో.. త్వరలో గ్లామర్ కథానాయిక కాజల్‌ను సరికొత్తగా చూడబోతున్నాం.