ఇదోలోకం.. అందమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశి, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘ఇదో ప్రేమలోకం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ఇదో అందమైన ప్రేమకథ అని, ప్రియుడికిచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని ఓ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ మహిళ కథనం ప్రధానంగా సాగుతుందని తెలిపారు. అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాలో పాటలు హైలెట్‌గా వుంటాయని, పాటలు కోదాడ, మట్టపల్లి, వేదాద్రి, అరకు వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని నిర్మాత్ ఎస్.పి.నాయుడు తెలిపారు. సుమన్, నరేశ్, భగవాన్, మేల్కొటే, దేవిశ్రీ, ప్రభావతి, టి.అశోక్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:వందేమాతరం, ఎడిటింగ్:నందమూరి హరి, కెమెరా:కె.శివ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:టి.కరణ్‌రాజ్.