గెలిచే ప్రేమికుడు... మజ్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాధారణంగా లవ్ ఫెయిల్యూర్స్ చాలామందికి ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే ఆ లవ్ ఫెయిల్యూర్స్‌ను దాటి వారి ప్రేమను సక్సెస్ చేసుకుంటారు’ అని అంటున్నాడు దర్శకుడు విరించి వర్మ. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న విరించి చేస్తున్న రెండో చిత్రమిది. నాని హీరోగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మజ్ను’. అను ఇమ్మాన్యుయేల్, ప్రియ హీరోయిన్స్‌గా రూపొందిన మజ్ను ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా విరించి వర్మతో ఇంటర్వ్యూ..
చిన్నప్పటినుంచి ఆసక్తి
చిన్నప్పటినుండి సినిమాలంటే ఆసక్తి. దాంతో ఇండస్ట్రీలోకి రావాలన్న కోరిక ఉండేది. పరిశ్రమలోకి వచ్చిన తరువాత మదన్ వద్ద ‘పెళ్ళైన కొత్తలో’, ‘ప్రవరాఖ్యుడు’, ‘గుండె ఝల్లుమంది’ సినిమాలకు వర్క్ చేశాను. రామ్మోహన్‌ని కలిసిన తర్వాత ఆయనకు ‘ఉయ్యాల జంపాల’ కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో దర్శకుడిగా మారాను.
మజ్ను అంటే..
లవ్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే ఆ లవ్ ఫెయిల్యూర్స్‌ను దాటి వారి ప్రేమను సక్సెస్ చేసుకుంటారు. అంత సిన్సియర్ లవర్ అన్నమాట. అయితే అప్పటి మజ్ను తన ప్రేమ కోసం చనిపోయాడు. కానీ మా మజ్ను సినిమా బాధాకరంగా వుండదు. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా మజ్ను హ్యాపీ మజ్ను. నాని, అను, ప్రియా మెయిన్‌గా నడిచే ఈ సినిమాలో ముగ్గురి మధ్య ప్రేమ ఉంటుంది కాని ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. అందుకే డిఫరెంట్‌గా ఉండే టిపికల్ లవ్‌స్టోరీ అని ట్రైలర్‌లోనే చూపించాం.
నానితో వర్కింగ్ సూపర్..
‘ఉయ్యాల జంపాల’ సినిమా నుండి నానితో మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో నానికి కథ వినిపించాను. కథ వినగానే నాని సినిమా చేయడానికి రెడీ అయ్యారు. నటుడిగా నాని యాక్టింగ్ టైమింగ్ చాలా బావుంటుంది. కథ రాసుకునేటప్పుడే నాని అనుకునే కథ రాసుకున్నాను. ఈ సినిమాలో కూడా ఒక పక్క ఏడుస్తూనే నవ్వించేలా సీన్స్ ఉంటాయి. ఇలాంటి వేరియేషన్స్ ఉన్న సీన్స్‌లో నాని మాత్రమే నటిస్తాడనిపించింది. తనతో వర్క్ చేయడం మంచి అనుభూతినిచ్చింది. షూటింగ్ టైంలో కూడా సీన్స్‌ను ఇంకా ఎలా బాగా చేయాలో చెప్పి సీన్స్ బాగా రావడానికి ఎంతగానో సపోర్టు చేశారు. నాని వరుస సక్సెస్‌లతో ఉన్నాడు కాబట్టి అందరూ నాని అంటే పాజిటివ్‌గా ఉంటారు. ఇప్పుడు నాని చెప్పే విషయాన్ని ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకంతో నేను టెన్షన్ పడలేదు.
స్క్రిప్ట్‌ను నమ్మాను..
నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పటినుండి జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి నమ్మకంగా ఉంటాను. కాబట్టే ద్వితీయ విఘ్నం గురించి భయపడలేదు. ఇక ఈ సినిమాలో నాని రాజవౌళిగారి అసిస్టెంట్ కనపడతారు. కాబట్టి ఓ సీన్‌లో ‘బాహుబలి’ చిత్రీకరణ లొకేషన్‌ను మజ్నులో చూపిస్తున్నాం. కాబట్టి రాజవౌళి ఈ సినిమాలో కనపడతారు. అలాగే హీరో రాజ్‌తరుణ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్‌లో కనపడతారు.
తదుపరి చిత్రం..
కథ రాస్తున్నా. కథ పూర్తికాగానే నేను అనుకున్న హీరోలను కలిసి కథ చెప్పి ఒప్పుకుంటే సినిమా చేస్తాను.

చిత్రం..దర్శకుడు విరించి వర్మ

-శ్రీ