ఇక పాడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ ఆశ.. అడియాస, చేజారే మణిపూస’ అంటూ భారమైన స్వరంతో గంభీరంగా పాడినా, సిరిమల్లె పువ్వల్లే నవ్వు.. అంటూ నవ్వులే సాహిత్యంగా, ఓ ఝరిలా ఆలపించినా, గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన అంటూ చిన్నపిల్లలా ముద్దుముద్దుగా స్వరాలు పలికినా గుర్తొచ్చే జానకి లాలి పాటతో గీతాలాపనకు టాటా చెప్పారు. తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు సినీ ప్రియులకు పంచిన ఎస్.జానకి సినిమాల్లోను, ఇతర వేదికలపై గీతాలన ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ‘విధియన్ విలయాట్టు’ అనే తమిళ సినిమాతో 1957లో పాడటం ప్రారంభించిన ఈ పాటల పల్లకి తన గాత్రం ద్వారా అశేష ప్రజానీకాన్ని మైమరిపించారు. గుంటూరులోని రేపల్లెకు చెందిన శిష్ట్లా జానకి గాయనిగా ఎక్కని మెట్టులేదు. సంగీతాన్ని దాదాపు 60 ఏళ్ళపాటు శాసించి అద్భుతమైన గీతాలను ఆలపించి లక్షలకొలది అభిమానులను సంపాదించుకున్నారు. తన 78 ఏళ్ళ జీవితంలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు సంగీతమే శ్వాసగా జీవించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, జపనీస్, జర్మన్, ఉర్దూ, అరబిక్ లాంటి భాషలలో ఇప్పటివరకూ దాదాపు 50వేల వరకూ పాటలను ఆలపించారు. చిన్నపిల్లలా పాడాలన్నా, ముసలి అవ్వలా స్వరాన్ని వణికించాలన్నా, అటు కర్నాటక సంగీతం బాణీలలో సంగీత ప్రియులను అలరించాలన్నా, ఇటు మాస్ మసాలాతో కిర్రెక్కించే గీతాలను విసిరేయాలన్నా ఆమెకు ఆమే సాటి! ‘పదునారు వయదినిలే’ అనే తమిళ సినిమాకుగాను 1977లో ‘సింధూరపువ్వే’ పాట ఆలపించినందుకు జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత ఆమె ఎక్కని ఎత్తులు లేవు. తెలుగు, మలయాళ, తమిళ భాషలలో మరోమారు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు. తన స్వరంలో ఓ గాయని ఎన్ని రకాల ప్రయోగాలు చేయవచ్చో అన్ని రకాల ప్రయోగాలను చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. వౌనగీతం చిత్రంలో ‘పాపా పేరు మల్లి, నా ఊరు కొత్త్ఢిల్లీ’ అన్నపాటతో మగ గొంతుతో పాడడం ఆమెకే చెల్లింది. మురిపించే మువ్వలు చిత్రంలో నాదస్వరానికి ధీటుగా తన గాత్రంలో స్వరాలను పలికించిన విదుషీమణి జానకి. దాదాపు 30 పర్యాయాలు అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ నేపథ్యగాయని అవార్డులను అందుకున్నారు. ఇటీవల ఆమెకు భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించి వార్తలకెక్కారు. ఈ అవార్డు తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని, భారతరత్న అవార్డును ఆశించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దక్షిణాది కళాకారులను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వ వైఖరికి నిరసనగా తాను ఈ అవార్డును తిరస్కరిస్తున్నానని ప్రకటించిన ధీశాలి ఎస్.జానకి. వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడిన ఆమె, ప్రస్తుతం ఆమె తన కుమారుడు మురళీకృష్ణతో చెన్నైలో నివశిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘10 కాల్పానికల్’ అనే చిత్రానికిగాను ‘అమ్మపూవీను’ అనే పాటను పాడుతున్నారు. ఈ పాటే తన కెరీర్‌లో చివరిపాట అని ఆమె ప్రకటించడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కోయిలమ్మ గీతాలను వినాలనుకుంటున్న శ్రోతలకు ఇది ఆశాభంగమే. సోషల్ మీడియాలో తాను పాట పాడడం ఆపేస్తున్నాను అని చెప్పడంతో నేను చనిపోయానని ప్రచారం చేశారని, బ్రతికి వుండగానే ఇలా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం తనను బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఈవిధమైన ప్రచారం చేయడం సరైన పద్ధతికాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక తాను పాట పాడడం ఆపేస్తున్నానని, ఇక ఏ కచ్చేరీలలో కూడా పాట పాడడానికి ముందుకు రానని ఆమె చెప్పడం విశేషం. సుమారు 50 వేల పాటలతో శ్రోతలకు వీనులవిందు చేసిన జానకి చేసిన ప్రకటన చాలామందికి రుచించలేదు. ఈ వార్తతో అశేష జానకమ్మ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

-యు