పూర్వజన్మలో నాగభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన అమ్మోరు, అరుంధతి చిత్రాల స్థాయిలో రూపొందించిన మరో చిత్రం నాగభరణం. రమ్య ప్రధాన పాత్రలో కన్నడంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. విజువల్ వండర్‌గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తాయని, కన్నడంలో విజయవంతమైనట్లుగానే తెలుగులో కూడా సంచలనం సృష్టించడం ఖాయమని ఆయన అన్నారు. త్వరలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. పూర్వజన్మలో తాను పోగొట్టుకున్న అనుబంధాలు, ఆప్యాయతలను ఆ తరువాత జన్మలో పొందిన ఓ యువతి కథనం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నాగభరణంతో ఆమెకున్న సంబంధం ఏమిటి అనే ఇతివృత్తంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లకు మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. దిగంత్, ముకుల్‌దేవ్, రవికాలె, అమిత్, రాజేష్ వివేక్, సాధుకోకిల, రంగాయన రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేణు, సంగీతం: గురుకిరణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, దర్శకత్వం: కోడి రామకృష్ణ.