ప్రేమకు శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తిచేసి, పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను యువతకు తెలియజేసే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నామని, త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేసి, ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ప్రేమికులకు ‘శ్రీరామరక్ష’గా నిలిచే అంశం ఏమిటి? అన్న కథనంతో సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని, పాటలకు మంచి క్లిక్స్ వస్తాయని వారు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: పరిమి కేదార్‌నాథ్, సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, నిర్మాత: ప్రభాత్‌వర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.