30న జర్నీ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్‌రావుచౌదరి రూపొందించిన చిత్రం ‘జర్నీ-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరినొకరు చూసుకోకుండా బస్సుమీద రాసుకున్న కవితలతో ఎలా ప్రేమలో పడ్డారు? ఈ నేపథ్యంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అవి ఎలా పరిష్కారమయ్యాయి? అనే ఆసక్తికర కథనంతో ‘జర్నీ-2’ చిత్రం తెరకెక్కించామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో సాగే ఈ చిత్రం కన్నడంలో విజయవంతమైందని, మొత్తం 5 పాటలతో సాగే ఈ చిత్రం స్వార్థంలేని నిజాయితీతో కూడుకున్న ప్రేమికుల మధ్య సాగే ఇతివృత్తంగా తెరకెక్కిందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం వుందని నిర్మాత చిగులూరి గంగాధరచౌదరి తెలిపారు. కార్యక్రమంలో జక్కుల నాగేశ్వరరావు, మల్కాపురం శివకుమార్ పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. మాళవిక, రాఘవేంద్రజోషి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: జగదీష్ వల్లి, ఎడిటింగ్: ఇ.ఎం.నాగేశ్వరరావు, పాటలు: వెనె్నలకంటి, సమర్పణ: కృష్ణచైతన్య శాఖమూరి, నిర్మాత: చిగులూరి గంగాధరరావుచౌదరి, కథ, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.నారాయణ.