నేర్చుకుంటేనే నిలదొక్కుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను సినిమారంగంలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు దాటిపోయింది. నటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను. ఏ పనైనా సరే శ్రద్ధపెట్టి నేర్చుకుంటాను. అందుకే ఇప్పుడు విజయాలన్నీ సాధ్యవౌతున్నాయి’ అని చెబుతోంది బాలీవుడ్ సుందరి దీపికాపదుకొనె. రోజూ షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు తెలియని కొత్త కొత్త విషయాలను ఎన్నో నేర్చుకున్నానని, ఈరోజు ఈ స్థాయికి రావడానికి అదే కారణమని, మొదటినుండి పడిన కష్టమే ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పుకొచ్చింది దీపిక. తాను సినీ కెరీర్ ప్రారంభించినప్పుడు అమాయకమైన ఎలా ఉన్నానో ఊహించుకుంటే నవ్వొస్తోందని, అయితే ఆ పరిస్థితికి మళ్లీ నేను వెళ్లకూడదనే అనుకుంటానని, అందుకే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే వుంటానని అంటోంది. రోజురోజుకీ మనకున్న నైపుణ్యాలను పెంచుకుంటేనే ఇక్కడ నిలవడం సాధ్యమని, అయితే ఇక అవసరం లేదు అనుకున్న రోజునుంచి మనం వెనక్కి వెళ్ళిపోతుంటామని, అలా వెళ్ళడం తనకు ఏమాత్రం ఇష్టంలేదు కనుక నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని అంటోంది. శ్రమే కదా విజయం!

ప్రియాంకే గొప్ప
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకన్నా గొప్ప నటి అని దీపికా మెచ్చుకున్నారు. తమ మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగినా అది నిజం కాదని ఆమె పేర్కొంది. నిజానికి ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లొ కొత్త ట్రెండ్ కన్పిస్తోంది. గతంలో హీరోయిన్ల మధ్య పోటీ, విభేదాలు స్పష్టంగా కన్పించేవి. ఒకదశలో విభేదాలు ఉన్న నటీమణులు కలసి పనిచేయకపోవడం జరిగేది. ఒకరుంటే మరొకరు నటించేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దీపిక, ప్రియాంక కలసి బాజీరావ్ మస్తానీలో నటించి అందరినీ మెప్పించారు.
ఇదే విషయాన్ని దీపిక ప్రస్తావించిందికూడా. ఇక జాతీయ ఉత్తమ నటి కంగనారనౌత్ ఈ మధ్య తెలుగువారికి పరిచయమైన నటి తమన్నా నటనను మెచ్చుకుంది. ‘క్వాంటికో’ సీరియల్ ద్వారా హాలీవుడ్‌లో గతేడాది అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు ‘బేవాచ్’ సినిమాలో నటిస్తోంది. కాగా దీపిక కూడా ఓ హాలీవుడ్ చిత్రంలో నటించనుంది. వృత్తిపరంగా పోటీ ఉందే తప్ప, ప్రవృత్తి అది కాదని నిరూపిస్తున్నారు తాజా తారలు.

చిత్రం.. దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రా