తెలుగువాడిగా గర్విస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిలక్ష్మి, సారాయి వీర్రాజు తదితర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన అజయ్‌ఘోష్ అచ్చమైన తెలుగువాడు. విశారణై చిత్రంలో గుంటూరు పోలీసు సి.ఐ విశే్వశ్వరరావుగా నటించాడు అజయ్‌ఘోష్. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు వెళుతున్న సందర్భంగా ఆయన్ను పలకరిస్తే పలు చిత్ర విశేషాలను తెలిపారు.
రన్ రాజా రన్ సినిమా షూటింగ్‌లో చలపతి అనే మేనేజర్ పరిచయమయ్యారు. ఆయన నన్ను చూసి తమిళ్‌లో నటిస్తావా అని అడిగారు. నటిస్తానన్నాను. దాదాపు మూడు నెలల తరువాత ఆయన ఫోన్ చేసి దర్శకుడు వెట్రిమారన్ ‘విశారణై’ చిత్రం రూపొందిస్తున్నారని, అందులో విలన్‌గా నటించడానికి తెలుగు వ్యక్తి కావాలని, కనుక చెన్నై రమ్మన్నారు.
అక్కడికి వెళ్లి ఆయన్ని కలిశాను. కలవగానే పరిచయం వున్నట్లుగానే నన్ను పిలిచి పోలీస్ అనుభవాలు ఏవైనా వుంటే చెప్పమన్నారు. నాకున్న పరిజ్ఞానంతో పోలీస్‌ల విషయాలను కొన్ని చెప్పాను. ఆయన వెంటనే నాకో మంచి విలన్ దొరికాడు అని మెచ్చుకొని ఆ అవకాశం ఇచ్చారు.
దాదాపు ఈ సినిమా షూటింగ్ 28 రోజులు చేశా. వెట్రిమారన్‌తో పనిచేయడం జీవితంలో మరిచిపోలేని అనుభవం. ఈ సినిమా విడుదలయ్యాక తమిళులను ఇబ్బందిపెట్టిన తెలుగువాడి పాత్రలో నటించడంవల్ల అక్కడ కొందరు నాపై భౌతికదాడులు చేయడానికి వచ్చారు. అంటే, ఆ పాత్ర అంత రక్తికట్టిందన్నమాట. ఆ తరువాత ఇదంతా నటన కదా అనిఅంటే, కొంచెం సర్దుకొని ఆగారు. ఈ విషయంలో దర్శకుడు వెట్రిమారన్ సినిమా విడుదలయ్యాక చెన్నైలోని కొన్ని ప్రాంతాలకు నన్ను పోవద్దని హెచ్చరించారు. మా తమిళ కుర్రాళ్ళను ఇన్ని ఇబ్బందులు పెడతావా అని, నీపై దాడి చేస్తారు కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ విషయం ప్రివ్యూ ప్రదర్శించిన విజయమహల్‌లో నుండి బయటికి రాగానే అర్థమైంది. అంటే నా పాత్ర అంతగా పండిందన్న ఆనందం కలిగింది.
షూటింగ్‌లో ఆ నలుగురు కుర్రాళ్ళు నాచేత నిజంగానే దెబ్బలు తిన్నారు. తాటిమట్టతో కొట్టడానికి నేను కూడా భయపడ్డాను. కానీ, నటనలో పూర్తిగా లీనమైన ఆ కుర్రాళ్ళు అలా కొడితేనే తమకు మంచి నటన వస్తుంది కనుక కొట్టమని చెప్పి మరీ కొట్టించుకున్నారు. కొట్టేశాక పక్కకుపోయి ఏడ్చేశాను నేను. ఇలాంటి ఓ మంచి చిత్రంలో నటించినందుకు తెలుగువాడిగా నేను గర్విస్తున్నాను. ఆస్కార్ ముంగిట్లోకి వెళుతున్నందుకు పరమానందం పొందుతున్నాను. ఓ నటుడికి ఇంతకన్నా ఏమికావాలి?