విశారణైలో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మరో ప్రయత్నం జరుగుతోంది. ఆస్కార్ విదేశీ భాషా విభాగంలో ఎప్పటికప్పుడు కథ, కథనాల్లో వైవిధ్యం, టేకింగ్‌లో నూతనత్వం వున్న చిత్రాలను ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా వున్న అనేక సమస్యల నేపథ్యంలో రూపొందించిన చిత్రాలకు అవార్డులు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ఆస్కార్ అవార్డుకోసం ఎంట్రీగా వెళ్ళేందుకు దాదాపు 29 చిత్రాలను పరిశీలించింది. ఈ చిత్రాలలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటుడు ధనుష్ రూపొందించిన ‘విశారణై’ చిత్రం ఎంపికైంది. ఆస్కార్ అవార్డ్స్ ఎంట్రీ సెలెక్షన్ కమిటీ జ్యూరీ చైర్మన్ దర్శకుడు కేతన్ మెహతా ఈ చిత్రాన్ని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. విశారణై చిత్రంలో ఎంచుకున్న కథాంశం, దాన్ని తెపై ఆవిష్కరించిన విధానం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని భారతదేశపు ఎంట్రీగా పంపుతున్నామని, జ్యూరీ మెంబర్లలో తమిళ సభ్యులెవరూ లేరని, జ్యూరీపై ఎలాంటి ఒత్తిడులు లేవని ఆయన అన్నారు. ఉత్తమ విదేశీ భాష చిత్రాల ఎంట్రీల సంఖ్య పెంచాలని, ఎందుకంటే ఈ 29 చిత్రాలు చూస్తే ఏ చిత్రాన్ని తక్కువగా అంచనా వేయలేమని, ఒకదానికొకటి ప్రతి విషయంలోనూ పోటీపడ్డాయని ఆయన అన్నారు. ‘విశారణై’ చిత్రం ఎంపికైన నేపథ్యంలో సినిమా యూనిట్‌లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ చిత్ర కథనం తమిళనాడులో ఓ సాధారణ ఆటో డ్రైవర్ రాసిన నవల. ఆ నవల పేరు ‘లాకప్’.
కథేంటి?
తమిళనాడు నుండి బ్రతుకుతెరువుకోసం ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన ఇద్దరు యువకులకు అక్కడి పోలీసులనుంచి ఎదురైన భయానక అనుభవాలు ఈ చిత్ర కథాంశం. చేయని నేరానికి అమాయకులను ఇరికించి, పోలీసులు పెట్టే నరకయాతనే ఈ చిత్ర కథాంశం. ఎక్కడో ఓ నేరం జరుగుతుంది. ఆ నేరానికి సంబంధించిన దోషిని పట్టుకోవాలి. కానీ వాడు దొరకడు. పోలీసు శాఖకు రాజకీయ నాయకులనుండి ఒత్తిడి రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఎలాగైనా సరే ఆ దోషిని పట్టుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరో కొందరు అమాయకులను పట్టుకువచ్చి పోలీస్ స్టేషన్‌లో చావబాది తామే ఆ నేరం చేశామని ఒప్పుకునేలా హింసిస్తారు. ప్రజల ముందుకు, మీడియా ముందుకు వారిని తీసుకువచ్చి తామే ఆ నేరాలు చేశామని చెప్పిస్తారు. ప్రాణంపై ఆశతో ఏదో విధంగా బ్రతుకుదామన్న కోరికతో అమాయకులు తామే నేరాలు చేశామని ఒప్పుకుంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే సమయంలో పోలీసులు చేస్తున్న దురాగతాలు వారికి తెలుసు కనుక, వారు బ్రతికి వుంటే ఎప్పటికైనా తమ అరాచకాలు బయటపెడతారన్న అనుమానంతో, ఆ అమాయకులను ఎన్‌కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడరు. అలా ఇద్దరి యువకుల జీవితంలో పోలీసులు చేసిన విచారణే ఈ చిత్ర కథాంశం. కథలో నేరస్థుడిగా ముద్రపడ్డ తరువాత వారిద్దరూ లాకప్‌లో వుండగా, ఓ రాజకీయ హత్య జరుగుతుంది. దానికి సాక్షులుగా పోలీస్ స్టేషన్‌లో వున్నందుకు వాళ్ళు చూశారు. వెంటనే ఆ హత్య నేపథ్యంలో సాక్షులుగా వున్న ఆ ఇద్దరినీ అంతమొందించమని రాజకీయ నాయకులు పోలీసులను వేధిస్తారు. పోలీసులు ఏమీ చేయలేక అధికారులు చెప్పినట్టు నడుచుకుంటారు. ఇలా నాణేనికి రెండువైపులా వున్న చీకటిని ఈ చిత్రం అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది. ఇందుకే ఈ చిత్రానికి పలు దేశాల్లో జరిగిన చిత్రోత్సవాల్లో అనేక పురస్కారాలు దక్కాయి. భారతదేశంలోనూ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ సహాయనటుడు విభాగంలో, ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జాతీయ పురస్కారాలను అందుకుంది ‘విశారణై’. ‘అట్టకత్తి’ దినేష్, మురగదాస్, సిలంబరస్, ప్రదీష్‌రాజ్, సముద్రఖని, అజయ్‌ఘోష్ ప్రధాన తారాగణంగా నటించారు. ఇందులో మొదటి నలుగురు కెమెరా మాంత్రికులు బాలూ మహేంద్ర ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు కావడం విశేషం. సామాజిక ప్రయోజనం ఆశించి రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే అనేక అవార్డులను, రివార్డులను అందుకుని విజయవంతమైంది. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవబోతోంది.

-సరయు