వైవిధ్యమైన ఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యామీనన్, క్రిష్ జె సత్తార్ జంటగా నటి శ్రీప్రియ దర్శకత్వంలో సన్ మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ.ఎం అందిస్తున్న చిత్రం ‘ఘటన’. మలయాళంలో విజయవంతమైన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ- దృశ్యం చిత్రం తరువాత తెలుగులో ఈ చిత్రానికి తాను నిర్దేశకత్వం వహించానని, ఆడదంటే ఆటబొమ్మ కాదని, తాను తలచుకుంటే ఆదిశక్తిలా విజృంభించి ఏదైనా చేయగల సత్తా వున్న సబల అని ఈ చిత్రం నిరూపిస్తుందని తెలిపారు. వైవిధ్యమైన కథనంతో కమర్షియల్ సినిమా ఫార్మెట్‌లో ఈ చిత్రం సాగుతుందని, ప్రధాన పాత్రలో నటించిన నిత్యామీనన్ నటన హైలెట్‌గా వుంటుందని ఆమె అన్నారు. సమాజంలో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక వ్యక్తికి జరిగినపుడు ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ చిత్రంగా రూపొందించామని ఆమె తెలిపారు. ‘ఘటన’ వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిందని, నర్స్ ఉద్యోగాలకోసం ఇతర దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే కథనంతో మహిళా ప్రధానంగా కథను రాసుకుని శ్రీప్రియ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని రాజ్‌కందుకూరి అన్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాత వి.ఆర్.కృష్ణ.ఎం అన్నారు. నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖారామన్, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:మనోజ్ పిళ్లై, ఎడిటింగ్:బసవన్ శ్రీకుమార్, సంగీతం:అరవింద్ శంకర్, పాటలు:అనంత్ శ్రీరామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీప్రియ.