రాజకీయాల్లోకి వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి విజయవంతమైన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గులో కథానాయికగా అందరికీ పరిచయమైన అచ్చమైన పదహారణాల తెలుగు నటి సంగీత దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఇన్నాళ్లు చెన్నయ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చా. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను తెలిపారు. ‘ఇన్నాళ్లుగా అనేక తమిళ, మలయాళ సీరియల్స్‌లో నటించడంవల్ల చెన్నయ్‌లోనే ఉండిపోయాను. ప్రస్తుతం అమీర్‌పేటలో ఇల్లు తీసుకున్నాను. ఇకపై టాలీవుడ్‌కు దగ్గరగా వుంటూ దర్శక, నిర్మాతలకు అందుబాటులో ఉండడానికి నిర్ణయించుకున్నాను. నా వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధవౌతున్నాను. తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న నేను తెలుగు సినిమాలకు ఎందుకు దూరం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. మా సొంత ఊరు వరంగల్. నేను నటించిన తొలి చిత్రం తీర్పు. కానీ విడుదలై గుర్తింపు తెచ్చింది మాత్రం ముత్యాలముగ్గు. దర్శకులు బాపు, విశే్వశ్వరరావు వంటివారి ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమలోకి వచ్చాను. దాదాపు ఇప్పటికి నాలుగు దశాబ్దాలనుండి నటిస్తున్నాను. ఇంకా నటించాలనే కోరుకుంటున్నాను. సీరియస్ పాత్రలే కాకుండా నవ్వించే పాత్రలు, అమ్మ తరహా పాత్రలు లాంటి ఏ పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. కన్నడ, మలయాళ, తమిళ భాషలు అన్నీ కలుపుకుని దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించాను. కొంతమంది దర్శకత్వం చేస్తారా అని అడుగుతున్నారు. ఆ ఆలోచనే లేదు. నిర్మాతగా చిత్రాలు తీయాలనే కోరిక వుంది. రాజకీయాల్లోకి రమ్మని చెన్నయ్‌లో అడిగారు. నేను ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోనే వుంటున్నాను కనుక టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నాను. సినిమాకు సంబంధించిన ఏ బాధ్యతనైనా ప్రభుత్వం అప్పగిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా. త్వరలో గౌరవ ముఖ్యమంత్రిని కలిసి నా నిర్ణయం తెలియజేస్తాను. ఇకనుండి తెలుగు చిత్రాల్లో నటించడానికి అందరికీ అందుబాటులో ఉండడానికి ఇక్కడికే వచ్చేశాను’ అంటూ ముగించారు.