వర్మ వర్సెస్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబ్త్రన్, బిందుబార్బీ జంటగా గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన పాత్రల్లో పాలిన్‌డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.్భవనవిజయ్ దర్శకత్వంలో నార్ని ఫణిదుర్గాప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం వర్మ వర్సెస్ శర్మ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఓ లఘు చిత్రం చూసి దర్శకుడికి ఈ అవకాశం ఇచ్చామని, ఫిల్‌గుడ్ మూవీగా హ్యూమర్‌తో కూడిన చక్కని కథను అందించారని తెలిపారు. ట్రెండ్‌కు తగిన విధంగా హాస్యభరిత చిత్రంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. వర్మ శర్మ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు టైటిల్‌కు తగ్గట్లే ప్రేక్షకులను నవ్విస్తాయని, ప్రతి సన్నివేశం సరదా సరదాగా సాగిపోతుందని, మెలోడీ పాటలతో రూపొందించిన ఈ చిత్రం కమర్షియల్ విలువలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు బి.్భవనవిజయ్ అన్నారు.