ఉర్రూతలూగించే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. రష్యాలో చిత్రీకరించిన పాటలతో ఈ సినిమా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. కోటిన్నర రూపాయల వ్యయంతో రూపొందించిన ఓ భారీ ఛేజ్ ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, రష్యాలో చిత్రీకరించిన పాటలు సినిమాకు అద్భుతంగా కుదిరాయని, హిప్ హాప్ తమిళ అందించిన బాణీలు ప్రేక్షకులను డాన్స్‌లు చేయిస్తారని అన్నారు. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిందని అన్నారు. సురాజ్ టేకింగ్ చూస్తే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతుందని, జగపతిబాబు విలనిజం హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎమ్.నాథన్, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, సంగీతం: హిప్‌హాప్ తమిళ, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.