మజ్ను నచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, అను ఇమాన్యుయేల్, ప్రియశ్రీ హీరో హీరోయిన్లుగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై రూపొందిన మజ్ను చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో హీరో నాని మాట్లాడుతూ, ‘మజ్ను సక్సెస్‌ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాల కారణంగా ఓపెనింగ్స్ ఎలా వుంటాయోనని అనుకున్నాం. కానీ ఊహించినదానికంటే రెట్టింపు కలెక్షన్లు దక్కాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. రాజవౌళి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమ సక్సెస్ కావడానికి లవ్‌లెటర్ కీరోల్ పోషించింది. నేను చేస్తున్న సినిమాలను ప్రేక్షకులు వరుసగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా వుంది’ అన్నారు. దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ- ‘ఈ సినిమాకు టెన్షన్ ఎక్కువగా పడ్డాను. కానీ సినిమా విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతుండడం ఆనందంగా వుంది. మా ఊరినుండి చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి బాగా తీశావు అని అభినందించారు. నానితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. తనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుంది’ అని అన్నారు. నిర్మాత కిరణ్ మాట్లాడుతూ- ‘మజ్ను విజయానికి సహకరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడం కోసం విజయయాత్రలను నిర్వహిస్తాం. నేడు వైజాగ్, రాజమండ్రిలలో, అక్టోబర్ 1న ఏలూరు, విజయవాడలో యాత్రలను నిర్వహిస్తామన్నారు.