భారీ సన్నాహాల్లో జనతా గ్యారేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఒక్క పాట మినహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించే చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుపుకుంటోంది. మహేష్‌తో ‘శ్రీమంతుడు’ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్‌ను ఓకె చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారని ఇప్పటికే గ్లామర్ భామ సమంత ఒక హీరోయిన్‌గా ఎంపికైంది. మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాంతోపాటు ఈ చిత్రంలో మరో కీలకపాత్రలో మలయాళ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్నట్లు తెలిసింది. దాంతోపాటు మరో ముఖ్యపాత్రలో ఫహాడ్ ఫాజిల్ అనే యువ మలయాళ నటుడు కూడా నటిస్తున్నాడట. మైత్రి మూవీస్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.