వరుస అవకాశాలతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తెలుగులో వరుస సినిమాలతోపాటు వరుస విజయాలు అందుకుంటూ
దూసుకుపోతోంది గ్లామర్ భామ రెజీనా. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న
ఈ భామకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం మీడియం హీరోల సరసన నటిస్తున్న ఈమె బడా హీరోల సరసన నటించేందుకు తెగ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే రవితేజ సరసన నటించిన ఈమె లేటెస్టుగా నటించిన సౌఖ్యం సినిమా కెరీర్ పరంగా కాస్త మైనస్‌గానే మిగిలింది. రొటీన్ పాత్రల్లో కాకుండా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకునేలా సినిమాల్లో నటిస్తున్న రెజీనాకు సౌఖ్యం దెబ్బతో కెరీర్ ఎలా వుంటుందో అని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈమె మనోజ్ సరసన ‘శౌర్య’, విశాల్ సరసన ‘కథాకళి’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల సక్సెస్‌తోనే తన కెరీర్ ముందుకెళ్ళే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏదేమైనా అటు గ్లామర్‌తోపాటు ఇటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భామకు టాలీవుడ్‌లో అవకాశాలకు కొదువే లేదు మరి!