నీలాంబరిలా త్రిష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘్ధర్మయోగి’. తమిళంలో ‘కొడి’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అందిస్తున్నారు. నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అలరించిన విషయం తెలిసిందే. ఆ స్థాయిలో ధర్మయోగిలో త్రిష పాత్ర ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్ కెరీర్‌లోనే ఓ వైవిధ్యమైన సినిమాగా ఈ సినిమా రూపొందిస్తున్నారని, ధనుష్ రెండు పాత్రలతో మంచి అంచనాలు ఉన్నాయని తెలిపారు. గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తెలుగులో ఈ సినిమాను ధర్మయోగి పేరుతో విడుదల చేస్తున్నామని, తమిళంలో పాటలు విడుదలై మంచి ఆదరణ పొందాయని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా రికార్డింగ్, డబ్బింగ్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు:శశాంక్ వెనె్నలకంటి, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:వెంకటేష్.ఎస్., సంగీతం:సంతోష్ నారాయణన్, సమర్పణ:జగన్మోహిని, నిర్మాత:సిహెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.