మెగాస్టార్ తో స్టెప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తిచేస్తోంది. ప్రస్తుతానికి ఈవారంలో ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కించేందుకు ఈ టీమ్ రెడీ అయిపోయింది. మొదట ఈ స్పెషల్ సాంగ్‌కు క్యాథరీన్ ట్రెసాను ఎంపిక చేసినా, తాజాగా రాయ్‌లక్ష్మిని ఈ సాంగ్‌కు కన్‌ఫర్మ్ చేశారు. చిరుతో కలిసి రాయ్‌లక్ష్మిఈ స్పెషల్ సాంగులో స్టెప్పులేయనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం.150’ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిపి రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

చిత్రం.. రాయ్ లక్ష్మి