పాటలు పాడే డి జె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై హరీశ్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘డి జె దువ్వాడ జగన్నాధమ్’. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను రూపొందిస్తున్నారు. ఆర్య, బన్నీ, ఆర్య-2, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో అల్లు అర్జున్‌కు మంచి హిట్ బాణీలు అందించిన దేవిశ్రీ, ఈసారి మంచి సంగీతాన్ని అందించాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని నిర్మాత రాజు తెలిపారు. బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని, సినిమా, కథ, క్వాలిటీ విషయంలో రాజీపడకుండా చేస్తున్నామని ఆయన అన్నారు. హీరోను తెరపై సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు హరీశ్ శంకర్ దిట్టని, గతంలో అతని చిత్రాలే ఈ విషయాన్ని నిరూపించాయని, ఈ చిత్రాన్ని కూడా బెస్ట్ క్వాలిటీతో రూపొందనుందని ఆయన తెలిపారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ఫైట్స్:రామ్‌లక్ష్మణ్, కెమెరా:ఐనాక బోస్, స్క్రీన్‌ప్లే:దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం:హరీశ్ శంకర్.ఎస్.