కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోడి రామకృష్ణ. తన కెరీర్‌లో ఎన్నో జానర్స్‌లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, ఈమధ్య విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలు రూపొందిస్తూ ఘన విజయాలు అందుకుంటున్నారు. తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన ‘నాగరహవు’ అనే సినిమాను తెలుగులో ‘నాగభరణం’ పేరుతో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 14న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పిన విశేషాలు.
విజువల్ వండర్..
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇదని మొదట ఎవ్వరికీ తెలియదు. టీజర్ తర్వాతే సినిమాకు ఓ క్రేజ్ వచ్చింది. రీరికార్డింగ్ సమయంలో విజువల్స్ కొన్ని చూసి వెంటనే సినిమాను తెలుగులో విడుదల చేయాలనుకున్నా. మా బ్యానర్‌లో ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘శౌర్య’ లాంటి మంచి సినిమాలను అందించాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గానూ ఓ మంచి సినిమాను అందించవచ్చని ‘నాగభరణం’తో వస్తున్నాం. కోడి రామకృష్ణ గురించి నేను ప్రత్యేకించి చెప్పేదేమీ లేదు. అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలతో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగాలు చేశారాయన. ఇప్పుడు ఈ సినిమాతో మరింత ముందుకెళ్లి, అదే విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో అద్భుతం సృష్టించారు. అలాంటి సినిమాను నేను విడుదల చేస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది.
అద్భుత ప్రయోగమే..
టీజర్ విడుదలైనప్పటినుంచీ విజువల్ ఎఫెక్ట్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. టీజర్ విడుదలైన 48 గంటల్లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. చనిపోయిన లెజెండరీ యాక్టర్ విష్ణువర్థన్‌ని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నమే సాహసం. అలాంటి సాహసాన్ని మకుట విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా చేపట్టింది. ఈగ, బాహుబలి లాంటి సినిమాలకు పనిచేసిన ఈ సంస్థ నాగాభరణంకి కూడా అదిరిపోయే విజువల్స్ ఇచ్చి సినిమాకు ప్రాణం పోసింది. విజువల్ ఎఫెక్ట్స్ కట్టిపడేసేలా ఉంటాయి. అదేవిధంగా కోడి రామకృష్ణ సినిమాలన్నీ మహిళలను బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే కోవలో మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అమ్మోరు, అరుంధతి సినిమాల తరహాలో నాగాభరం ఉంటుంది.
విడుదల భారీగానే..
ఈ సినిమాకు ఎగ్జిబిటర్స్ వద్ద నుంచి సూపర్ రెస్పాన్స్ ఉంది. టీజర్, ట్రైలర్ చూసి సినిమాకు పోటీ కూడా కనిపించింది. దసరా వారానికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడుతూ ఉండడంతో వాటికి థియేటర్స్ అలాగే ఉంచాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి 450-500 థియేటర్లలో విడదల చేస్తున్నాం. రిలీజ్ తర్వాత మరిన్ని థియేటర్లు పెంచుతాం. కన్నడ, తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలవుతోంది.

-శ్రీ