మెగాఫోన్లకు విరామం.. నిర్మాణానికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా నిర్మాణమంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తేనే అది తెరపై అందమైన కలగా సప్తవర్ణ శోభితంగా ఉంటుంది. ఒక సినిమా నిర్మాణం వెనుక అనేకమంది కృషి వుంటుంది. ముఖ్యంగా సినిమా అనేది ఓడ అయితే, దానిని నడిపించే సరంగు దర్శకుడే. అతను చెప్పినట్లే నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ నడుచుకుంటేనే ఓ అందమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఇన్నాళ్లు దర్శకులు నిర్మాతలను శాసించే స్థానంలో ఉన్నారు. అతను ఎంత చెబితే అంత అన్నట్లుగా సాగింది. అయితే, అప్పుడప్పుడు దర్శక నిర్మాతలమధ్య ఇగో బాధలు, సినిమా బాగా రావాలన్న ఆతృత, ఉత్సాహం లాంటి అంశాలతోపాటుగా కథ, కథనాలలో చిన్న చిన్న పొరపొచ్ఛాలు కూడా ఎదురయ్యేవి. ఏది ఏదురైనా కానీ దర్శక నిర్మాతలిద్దరూ సినిమా రూపొందించడంలో నిష్ణాతులే కనుక, ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి ఆ తప్పును సరిచేసుకుంటూ సినిమాను నిర్మించేవారు. అలా ఒకరికి నలుగురు సంప్రదించి రూపొందించిన చిత్రాలన్నీ ప్రేక్షకులకు నచ్చేవి. ఇది ఒకప్పటిమాట. ఇప్పుడు దర్శక నిర్మాతలిద్దరూ ఒక పట్టాన ఒకే ఆలోచనలోకి ఇమడలేకపోతున్నారు. దీని పర్యవసానంగా దర్శకులే నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నారు. నిర్మాతలు మాత్రం మెగా ఫోన్లు పట్టి సినిమాను రూపొందించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ, దర్శకులు మాత్రం ఉన్న సృజనాత్మకతను స్వేచ్ఛాయుతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయడానికి తామే బడ్జెట్‌ను నిర్ణయించుకొని సినిమా నిర్మాణానికి పూనుకుంటున్నారు.
ఒక కథను తనకు నచ్చినవిధంగా రూపొందించాలని అనుకుంటే నిర్మాత ఒప్పుకోకపోవచ్చు అన్న ఆలోచనతో తామే ఆ సినిమా తీస్తే బాగుంటుంది అన్న కోరికతో నిర్మాణంవైపు మొగ్గుచూపుతున్నారు. దానికితోడు ఒక దర్శకుడు అగ్రస్థాయికి వెళ్ళాక తనకంటూ ఓ బృందాన్ని ఏర్పాటుచేసుకోవడానికి ఫిలిం ఫ్యాక్టరీలు లాంటివి ప్రారంభించి తమ శిష్యులనుగాని, తెలిసినవాళ్ళకుగాని దర్శకత్వ బాధ్యత అప్పగించడం ఇప్పుడు ఓ సరికొత్త ట్రెండ్‌గా మారింది. రాంగోపాల్‌వర్మ ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. ఆయన ఏది తీసినా హిట్ అన్న టాక్ వచ్చాక, బిజీగా మారడంవల్లో లేక ముంబై వెళ్లిపోవడంవల్లనో తమ శిష్యులకు దర్శకులుగా అవకాశమిచ్చి తానే చిత్రాలను రూపొందించారు. ఆ తరువాత సుకుమార్ కూడా స్వంత నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి తన శిష్యులకు దర్శకుడిగా అవకాశమిస్తున్నారు. భారీ క్రేజ్‌తో స్టార్ డైరెక్టర్‌గా వెలుగుతున్న పూరి జగన్నాధ్ కూడా నిర్మాతగా సినిమాలు తీస్తుండడం విశేషం. తమిళంలో మురగదాసన్ కూడా తన శిష్యులకు దర్శకుడిగా అవకాశాలను ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. తాజాగా ఆయన తమ్ముడు హీరోగా, శిష్యుడు దర్శకుడిగా గోలీసోడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో క్రేజీ దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ కూడా నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. రచయితగా తనదైన మాటల బాణాలతో జనాల మనస్సులను దోచుకొని దర్శకుడిగా నిరూపించుకొని ఇప్పుడు మంచి చిత్రాల నిర్మాణానికి పూనుకుంటున్నానంటూ ఆయన నిర్మాతగా అవతారమెత్తారు. అ ఆ చిత్రంతో మొదలుపెట్టిన ఆయన దేవుడే దిగివస్తే అనే చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో వున్నారు. కొత్తతరహా చిత్రాలను పరిచయం చేయాలనే ఆలోచనతో తాము నిర్మాతలుగా మారుతున్నామని, నిర్మాణంలో దిగిన ప్రతి దర్శకుడు చెబుతుండడం విశేషం. ఇది మంచి పరిణామమే. మంచి చిత్రాలను ప్రేక్షకుడు ఎప్పుడూ స్వాగతిస్తాడు కదా!

చిత్రాలు.. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్

-యు