సంక్రాంతికి దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. సురభి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు వివరించారు. ‘మా బ్యానర్‌లో తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’ చిత్రం మంచి విజయం సాధించడంతో మళ్లీ మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి మొదటినుంచీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయి. జనవరి 14న సంక్రాంతి కానుకగా భారీగా విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ప్రవీణ్ లక్కరాజు, కెమెరా:కార్తిక్ ఘట్టమనేని, ఎడిటింగ్:సత్య.జి., నిర్మాతలు:వంశి, ప్రమోద్, దర్శకత్వం:మేర్లపాక గాంధి.