సరికొత్తగా ఇజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కల్యాణ్‌రామ్, అథితి ఆర్య జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ‘ఇజం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ- ‘సరికొత్త కానె్సప్ట్‌తో ఇదివరకు తెలుగులో ఎక్కడా చూడని పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, పాటలు ఆకట్టుకున్నాయి. సిక్స్‌ప్యాక్ బాడీలో కల్యాణ్‌రామ్ నటన కొత్తగా వుంటుంది. ‘ఫెమినా మిస్ ఇండియా’ అతిథి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కల్యాణ్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. వినోదంతోపాటు మంచి సోషల్ ఎలిమెంట్‌ను జతచేసి పూరి జగన్నాధ్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:ముకేష్, ఎడిటింగ్:జునైద్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:పూరి జగన్నాధ్.